రైట్‌ రైట్‌’ సినిమా రివ్యూ




సినిమా : రైట్ రైట్
నటీనటులు : సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి, పావని గంగిరెడ్డి, తదితరులు
దర్శకుడు : మను
నిర్మాత : జె. వంశీకృష్ణ
సంగీతం : జె.బి
విడుదల తేదీ : 10-06-2016
కథ:
పోలీసు కావడమే లక్ష్యమనుకొన్న ఓ యువకుడు రవి (సుమంత్‌ అశ్విన్‌). పరిస్థితుల ప్రభావంతో కండక్టర్‌ ఉద్యోగంతో సంతృప్తి పడతాడు. ఉత్తరాంధ్రలో గవిటి వెళ్లే బస్సులో ఉద్యోగం చేస్తుంటాడు. ఆ బస్సుకి డ్రైవర్‌ శేషు (ప్రభాకర్‌). ఇద్దరికీ గవిటి గ్రామంతో అనుబంధం పెరుగుతుంది. అందరూ పరిచయమవుతారు. అయితే ఒక రోజు దారి మధ్యలో బస్సు చెడిపోతుంది. రిపేరు పూర్తయ్యాక బస్సుని రవి నడపాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే రోడ్డుపై ప్రమాదం జరుగుతుంది. కిందకి దిగి చూస్తే ఓ యువకుడు బస్సు ముందు చావు బతుకుల మధ్య పడి వుంటాడు. తానే బస్సుతో ఆ యువకుడిని ఢీ కొట్టానని రవి భావిస్తాడు. ఇంతలో అదే దార్లో వెళుతున్న జీపులో ఆ యువకుడిని ఆస్పత్రికి పంపి బస్సుతో సహా గవిటి చేరుకొంటారు శేషు.. రవి. ఉదయం టౌన్‌కి వెళ్లి ఆరా తీస్తే ఆ యువకుడు ఏ ఆస్పత్రిలోనూ కనిపించడు. రెండు రోజుల తర్వాత వూరి పక్కనున్న లోయలో శవమై కనిపిస్తాడు. ఆ యువకుడు గవిటికి చెందిన విశ్వనాథం మాస్టారు కొడుకని తెలుసుకుంటారు శేషు.. రవిలు. ఇంతకీ రవి బస్సు ఢీ కొట్టటంతోనే శేషు చనిపోయాడా? లేక ఎలా చనిపోయాడన్నది అసలు కథ. ఈ సస్పెన్స్ తెలియాలంటే స్క్రీన్ పై చూడాల్సిందే. 

నటీనటులపెర్ఫార్మెన్స్:
ముందుగా హీరో సుమంత్ అశ్విన్ గురించి మాట్లాడుకుంటే.. గత చిత్రాలతో పోల్చుకుంటే ఇందులో చాలా బాగా నటించాడు. పాత్ర పరిధులు దాటకుండా తన శక్తిమేర బాగా చేశాడు. ఇక బస్ డ్రైవర్ శేషుగా నటించిన ప్రభాకర్ కూడా చాలా బాగా చేశాడు. తన పాత్రతో అందరూ కనెక్ట్ అయ్యేలా ప్రభాకర్ బాగా నటించాడు. ఇక హీరోయిన్‌గా పూజా జవేరికి చెప్పుకోదగ్గ సన్నివేశాలేవీ లేకపోయినా, ఉన్నంతలో బాగా చేసింది. నాజర్ ఎప్పట్లానే తన స్థాయికి తగ్గ నటనతో మెప్పించారు. పావని గంగిరెడ్డి తన పాత్రలో ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్పెర్ఫార్మెన్స్ :
ఈ సినిమాకి శేఖర్ వి జోసఫ్ అందించిన సినిమాటోగ్రపీ అమోఘం. ఆయన పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా మూడ్‌ను ఎక్కడా మిస్ కానివ్వకుండా.. లొకేషన్స్‌ని సరిగ్గా వాడుకుంటూ ఓ మంచి ఫీల్ తెచ్చారు. జేబీ అందించిన మ్యూజిక్, ఉద్ధవ్ ఎడిటింగ్ ఫర్వాలేదు.
ఇక దర్శకుడు మను గురించి మాట్లాడుకుంటే.. మళయాలంలో ఆకట్టుకున్న కథను, ఇక్కడి నేపథ్యానికి తగ్గట్టుగా బాగానే మార్చుకున్నాడు కానీ.. ఆడియెన్స్‌ని మెప్పించేంతలా దాన్ని తెరకెక్కించలేకపోయాడు. దర్శకుడిగా మాత్రం కొన్నిచోట్ల మంచి ప్రతిభే చూపాడు. కానీ.. పూర్తి స్థాయిలో ప్రతిభ చూపడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి.
 రైట్ రైట్మూవీ రేటింగ్ : 2.5/5
Labels:

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget