స్వర్గీయ ఎన్టీఆర్ లక్షణాలన్నీ మనవడు జూనియర్ ఎన్టీఆర్ లో కనిపిస్తున్నాయని అంతా భావిస్తుంటారు. నటన విషయంలోనూ తాత తర్వాత మనవడు జూనియర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాత రూపాన్నే పుణికి పుచ్చుకున్నాడని తారక్ ను చూసిన వాళ్లంతా అభివర్ణిస్తుంటారు. నేటి తరం నందమూరి వంశం హీరోల్లో ఫామ్ లో ఉన్న ఎకైక స్టార్ కూడా జూనియర్ ఎన్టీఆరే. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం సీనియర్ ఎన్టీఆర్ తో అస్సలు పోల్చవద్దని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి ఈ విధంగా స్పందించారు.
ఎన్టీఆర్ కి…జూనియర్ ఎన్టీఆర్ కి పోలికా? ఇద్దరినీ పక్కనబెట్టి చూస్తే వ్యత్యాసం ఏంటన్నది క్లియర్ గా తెలుస్తుంది. ఇద్దరికీ హస్తిమశకాంతరం. సీనియర్ ఆజాను బాహుడైతే…జూనియర్ అరజాన బాహుడు. ఆయన అందమైన రూపం ఆ ఫ్యామిలీలో ఎవరికీ రాలేదు. నటన, రూపం విషయంలో ఆయనకు సాటిలేరు. ఈ విషయంలో ఎన్టీఆర్ కు వారసులే లేరని వ్యాఖ్యానించారు
Post a Comment