Kabali is an upcoming 2016 Indian Telugu-language film written and directed by Pa Ranjith. The film stars Rajinikanth, Radhika Apte and Dinesh. Music composed by Santhosh Narayanan. Think Music has acquired the audio rights for all three languages – Tamil, Telugu and Hindi. Kabali Songs.
Kabali 2016 Telugu Movie Starcast : Rajinikanth, Radhika Apte Director : Pa Ranjith Music : Santhosh Narayanan Producer : Kalaipuli S.Thanu Banner : V Creations & Shanmukha Films Audio Label : Think Music
Song: Kalavani O Nadhi Singer: Pradeep Kumar Lyrics: Vanamali Flute: Vishnu Vijay Acoustic Guitar: Pradeep Kumar Electric Guitar: Joseph Vijay Chorus: Vasudevan, Senthil Das, Sam, Sunderrajan, Balaji, Murali Strings: Macedonian Radio Symphonic Orchestra Strings arranged by Pradeep Kumar Strings Conducted by Oleg
Song: Nippu Ra Rap and Lyricas Verses: Vanamali Dialogues/adlib verses: Shri Rajinikanth Electric Guitars: Jhanu Chantar Acoustic Bass: Pradeep Kumar Electronic Drums: Tapass Naresh
All songs composed, arranged, programmed by Santhosh Narayanan All songs recorded at Future Tense studios, Prism Sounds Studios, Krimson Avenue Studios, Studios 301 (Sydney), Oveyen (Sydney), Studio M1 (Macedonioa) Recorded by RK Sundar, Simon Todkill (301), Vishnu (Krimson Avenue) Mixed by Santhosh Narayanan, RK Sundar Mixed at Krimson Avenue Studios, Future Tense, Studios 301 (Sydney) Pianica : sajan shenoy Mastered by leon zeros at studios 301 Additional mix in Veera Thurandhara: Sat Richard Sydney Musicians Coordinator Meenakshi Iyer Macedonia orchestra coordinator Rahul Ramachandran Special thanks to Adam Wilkinson (Sydney) Special thanks to Vijaynarain, Sri Shyamalangan for their contribution in the ‘whistle theme’
నందమూరి బాలకృష్ణ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ వచ్చే నెల 2 నుండి మొదలు కానున్నట్టు సమాచారం. 22 రోజుల పాటు జార్జియాలో జరుగనున్న ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ వచ్చే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇదంతా చూస్తుంటే అన్నిటికంటే ముందు యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసేందుకే దర్శకుడు కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. మొరాకోలో జరిగిన తొలి షెడ్యూల్‌లో 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు సహా 200 గుర్రాలతో కొన్ని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన క్రిష్ హైదరాబాద్‌లో జరిగిన తర్వాతి షెడ్యూల్లోనూ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో మరి కొన్ని యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక తర్వాతి షెడ్యూల్‌ను వాటికే కేటాయించారు. ‘బాహుబలి’ తర్వాత యుద్ధ నేపథ్యంలో వస్తున్న సినిమా గనక ఆ స్థాయికి తక్కువ కాకుండా క్రిష్ జాగ్రత్త వహిస్తున్నారట. బాలయ్య వందో చిత్రంగా రానున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
లైలా తన లుక్‌తో అభిమానుల గుండెల్లో హీట్ పెంచేశారు. ఇంతకీ ఈ లైలా ఎవరో తెలిసే ఉంటుంది. తెలుగు చిత్రం ‘ఒక లైలా కోసం’లో నాగచైతన్య ప్రేయసి లైలాగా కుర్రకారు గుండెలను దోచేసిన పూజా హెగ్డే ఆ తర్వాత ‘ముకుంద’ చిత్రంలో నటించారు. హిందీలో తొలి చిత్రం ‘మొహంజదారో’ విడుదల కాక ముందే ఆ చిత్రంలోని లుక్‌తో బాలీవుడ్‌ను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా...? ఒకే ఒక్క యాడ్‌తోనే ఆమె ఈ బంపర్ ఆఫర్ కొట్టేశారు.
సినిమాల్లోకి రాకముందు పూజ చే సిన యాడ్ ‘మొహంజదారో’ టీమ్ దృష్టిలో పడింది. అంతే.. ఆ భారీ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ చాన్స్ వచ్చేసింది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.హృతిక్ ప్రేయసి చానీగా పూజ ఇందులో నటిస్తున్నారు. గురువారం విడుదల చేసిన చానీ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు ‘చానీ.. లుకింగ్ సో చార్మింగ్’ అని పూజాని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది.
అయితే ఈసినిమా ప్రారంభం అయిన సమయంలో హుషారు అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నట్టుగా తెలిపారు. అది ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామన్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్ లో కడప కింగ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు.
అయితే ఇదే పవన్ సినిమా టైటిల్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లా తెల్ల బట్టల్లో కనిపించటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. నిజంగానే పవన్ సినిమా టైటిల్ కడప కింగా కాదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
తెలుగు చలన చిత్రసీమలో విలక్షణ నటుడిగా పేరొందిన మంచు మోహన్ బాబు కొద్దిసేపటి క్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజేంద్ర నగర్ సమీపంలోని లక్ష్మీగూడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా దూసుకువచ్చిన మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోహన్ బాబు కారు స్వల్పంగా డ్యామేజ్ అయినా ఆయనకు మాత్రం గాయాలేమీ కాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Nagarjuna Emotional Speech at Saahasam Swaasaga Saagipo Telugu movie audio Launch. #SSS ft Akkineni Naga Chaitanya and Manjima Mohan, music by AR Rahman and directed by Gautham Vasudev Menon.
#SSS movie also ft Rakendu Mouli Vennelakanti, Baba Sehgal and Nagineedu.
For more updates about #SSSAudioLaunch and #SSSAudio stay tuned to Saahasam Swaasaga Saagipo.
Movie : Saahasam Swaasaga Saagipo Cast : Naga Chaitanya and Manjima Mohan. Direction : Gautam Vasudev Menon Music : AR Rahman Producer : M Ravinder Reddy Dialogues : Kona Venkat Art : Rajeevan Editor : Antony Stunt : Silva Banner : Guru Films India
Saahasam Swaasaga Saagipo is a bilingual movie made simultaneously in Telugu & Tamil. Achcham Yenbadhu Madamaiyada is the Tamil version, ft. Simbu / Silambarasan & Manjima Mohan.
ఒక్క అమ్మాయి తప్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. తొలిసారిగా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ తో కలిసి నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు సందీప్. బుధవారం ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజునే యాక్షన్ సీన్స్ షూటింగ్ ప్రారంభించగా.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సందీప్ తలకు బలమైన గాయం తగలడంతో యూనిట్ సభ్యులు వెంటనే అతన్ని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన పై స్పందించిన హీరో సందీప్ కిషన్ 'ఇప్పుడు బాగానే ఉంది. కొన్ని కుట్లు పడ్డాయి. కృష్ణవంశీ గారి సెట్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కానీ సీన్ చాలా బాగా వచ్చినందకు ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి హీరో ఎవరు? దిల్ రాజు, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో నటించే గోల్డెన్ చాన్స్ ఎవరికి దక్కుతుంది? ప్రస్తుతం ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. 'అ.. ఆ' సినిమా విజయంతో మంచి ఊపుమీదున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌ను హీరోగా తీసుకోవచ్చన్నది టాలీవుడ్ టాక్. ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేశ్ బాబులతో రెండేసి సార్లు పనిచేసిన ఈ స్టార్ డైరెక్టర్.. ఈసారి వాళ్లు కాక మరో కొత్త హీరోతో చేయాలని భావిస్తున్నాడట. అందుకే తాను ఇప్పటివరకు పనిచేయని చెర్రీ లేదా తారక్‌లలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రామ్‌చరణ్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్ 'ధ్రువ'లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేస్తున్నాడు. త్రివిక్రమ్ తన కొత్త సినిమా కథ చెప్పగానే ఎన్టీఆర్ బాగా థ్రిల్లైపోయి.. వెంటనే సరేనన్నాడని కూడా వినిపిస్తోంది. కొన్ని వారాల్లోనే హీరో ఎవరన్నది ఫైనలైజ్ అవుతుందని, ఇక వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.