భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితంపై ఇమ్రాన్ హష్మీ హీరోగా హిందీలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘అజహర్’ సినిమాలో అజహరుద్దీన్ జీవితం, ఆయన మాజీ భార్య అయిన సినీ నటి సంగీతా బిజ్లానీ సహా పలువురు నిజజీవిత వ్యక్తులు పాత్రలు కనిపించడం సహజం. సంగీతా బిజ్లానీ పాత్రను వెండితెరపై నర్గిస్ ఫక్రీ పోషించనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారమే వివాదాస్పదంగా మారింది. మొదట్లో ఈ సినిమా, అందులోని పాత్ర గురించి మాట్లాడేందుకు చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతను కలిసే ప్రయత్నం చేశారు.
కానీ, ఈ ప్రాజెక్ట్‌తో తమకేమీ సంబంధం లేదని సంగీత తేల్చేశారు. తీరా ఇప్పుడు తనతో ఏ మాత్రం పోలిక లేని నర్గిస్ ఫక్రీ ఆ పాత్రను పోషించడం సంగీతకు నచ్చట్లేదని వినికిడి. దాంతో, రేపు సినిమాలో తన పాత్రను సరిగ్గా తీర్చిదిద్దకపోతే ఆమె చట్టపరంగా చర్య తీసుకోవాలని భావిస్తున్నారట! అయితే, అజహరుద్దీన్ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లోని భావోద్వేగభరిత ఘట్టాలకు వెండితెర రూపమైన ఈ సినిమాలో నటిస్తున్నందుకు నర్గిస్ ఫక్రీ మాత్రం మహదానందపడిపోతున్నారు. వీలుంటే, త్వరలోనే సంగీతా బిజ్లానీని స్వయంగా కలవాలని కూడా భావిస్తున్నారు. ‘‘ఈ సినిమాలో ఆమె (సంగీత పాత్ర)ను ఎంతో హుందాగా దర్శకుడు తీర్చిదిద్దారు.
మా దర్శకుడు చెప్పినట్లే చేశాను. కాకపోతే, ఆమె గురించి అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం చదివాను. పరిచయస్థుల ద్వారా అజహర్, సంగీతల జీవితం గురించి తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో, ‘‘స్క్రిప్ట్‌లోని పాత్రలన్నీ నిజజీవితంలో సజీవంగా ఉన్నవారివి కాబట్టి, కచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి, కొంత భయంగా కూడా ఉంది’’ అన్నారు. మొత్తానికి, నిజజీవిత కథల మీద ఆధారపడి తీస్తున్న సినిమా అంటే, ఆ నిజజీవిత వ్యక్తులకైనా, ఈ తెర మీద నటిస్తున్నవాళ్ళకైనా అనుమానాలు, భయాలు సహజమే కదూ!

Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.