రష్మిగౌతమ్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, జశ్వంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చారుశీల. కెమెరామెన్ వి.శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను భీమనేని శ్రీనివాసరావు, ఫస్ట్‌లుక్‌ను జి.నాగేశ్వరరెడ్డి, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ దర్శకుడు సాగర్‌గారు బాక్సాఫీస్ వద్ద కోట్లు వసూలు చేసే చిత్రాల్ని అందించే శిష్యులను చిత్ర పరిశ్రమకు అందించారు. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్న ఆయన కోట్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంతో తమ్ముడు శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా, ఆయన తనయుడు జశ్వంత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక థ్రిల్లర్ సబ్జెక్ట్. మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నాను. కెమెరామెన్‌గా 100 చిత్రాలు పూర్తయిన తరువాత దర్శకుడిగా సినిమా చేయాలనుకున్నాను. మా అన్నయ్య సాగర్‌కు కథ చెప్పిన వెంటనే సినిమా చేద్దామని మొదలుపెట్టారు. వీల్‌చైర్‌లో కూర్చునే పాత్రలో రాజీవ్ కనకాల అద్భుతంగా నటించారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, బాబ్జీ, చిత్ర సమర్పకులు కొండపల్లి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.