గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు

సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రోబో 2. రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మరింత భారీగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా కనువిందు చేయనుందట. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ లో భారీ మొత్తాన్ని గ్రాఫిక్స్ కోసమే కేటాయిస్తున్నారు.
ఏడు ప్రఖ్యాత కంపెనీలు కలిసి రోబో 2 సినిమాకు గ్రాఫిక్స్ అందిస్తున్నాయి. ఇందు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి రెడీ అయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఐ సినిమా డిజాస్టర్ కావటంతో రోబో 2ను సూపర్ హిట్ చేసి తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్నాడు శంకర్. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు.

Labels:

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget