May 2016




Published on May 23, 2016

Varun Sandesh is one of the blessed actors in Telugu industry. He has seen many up and downs in industry. He was introduced to the telugu industry with Sekhar Kamula's Happy Days Movie and his active acting turned his carrier into movies. He is an Actor and also a good singer. But these days he din't receive great hits and he has no offers. Watch this interview to know the more about his movie life and his love marriage.


నాగచైతన్య డబుల్ ధమాకా అంటూ కొన్నాళ్ళనుండి ఊరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడా ముహుర్తం రానే వచ్చింది. ఆయన హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘ప్రేమమ్’ సినిమాలు నెల రోజుల వ్యవధిలో తెరమీదికి రానున్నాయి. ‘ఏ మాయ చేశావే’ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చైతూ నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చిత్రీకరణ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 17న పాటల్ని, జులై 15న సినిమాని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

మరోవైపు చందు మొండేటి దర్శకుడిగా మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తెలుగులో రీమేక్ అవుతోన్న సంగతి విధితమే. ఈ సినిమా చిత్రీకరణ సైతం ఇప్పడు తుది దశకు చేరుకుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 12న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందిట. ముందుగా అనుకున్న ప్రకారమైతే జులైలోనే ‘ప్రేమమ్’ తెరమీదికి రావాల్సుంది. అయితే ‘సాహసం..’ విడుదలలో జాప్యం, వెంకటేష్ హీరోగా సితార ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘బాబు బంగారం’ చిత్రం అదే సమయానికి విడుదల కానుండటం తదితర కారణాలతో ఆగష్టుకి మార్చారట. ఏమైనా నెల తిరక్కుండానే రెండు విజయాలను వరుసగా తన ఖాతాలో వేసుకునేందుకు ఈ అక్కినేని హీరో రెడీ అవుతున్నాడన్నది అసలు విషయం. అన్నట్టు ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా సైతం అదే రోజున తెరమీదికి రానుంది. అంటే బాక్సాఫీస్ వద్ద నందమూరి వర్సెస్ అక్కినేని యుద్ధం మొదలవనుందన్నమాట.




అమెరికా సిన్సినాటి జూలో గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో పొరపాటున పడిపోయిన నాలుగేళ్ల బాలుడిని రక్షించేందుకు పోలీసులు 17 సంవత్సరాల వయసున్న గొరిల్లాను కాల్చి చంపారు. 12 అడుగుల లోతున్న ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాబును గొరిల్లా తొలుత ఏమీ చేయలేదు. కాసేపు నీటిలో పిల్లాడిని ఎత్తుకుంది. తన కాళ్ళ మధ్యలో పెట్టుకుంది. గొరిల్లా పేరు హరాంబే. గొరిల్లాను చంపడాన్ని కొందరు వ్యతిరేకించారు. అయితే బాలుడిని కాపాడటం కోసం మరో గత్యంతరం లేకపోయిందని జూ డైరక్టర్ తెలిపారు.

 


రయ్.... మంటూ ఓ బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌లోకి దూసుకెళ్లిపోయే స్పోర్ట్స్ కార్లు... రోమాలు నిక్కబొడుచుకునే పోరాట సన్నివేశాలు... ఇవన్నీ హాలీవుడ్ సూపర్‌హిట్ సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో ఉండే హైలైట్ సీన్స్. గత ఏడాది ఈ సిరీస్‌లోని ఏడో భాగం కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తదుపరి సీక్వెల్ ‘ఫాస్ట్ 8’పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న డ్వేన్ జాన్సన్, విన్ డీజిల్ గెటప్స్ ఎలా ఉంటాయా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

వాళ్ల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. ఈ చిత్రంలోని ఏజెంట్ హాబ్స్ పాత్రధారి డ్వేన్ జాన్సన్ లుక్ ఒకటి బయటికొచ్చింది. ‘‘ఏజెంట్ హాబ్స్ పాత్రకు కొత్త వెర్షన్ ఇది. ఫ్యాన్స్‌కు ఈ లుక్ నచ్చేయడం గ్యారెంటీ’’ అని సోషల్ మీడియాలో డ్వేన్ జాన్సన్ పేర్కొన్నారు. ఆయన అనుకున్నట్లుగానే ఈ లుక్ చూసినవాళ్లు ‘రాక్ (డ్వేన్ జాన్సన్‌కు మరో పేరు) ఈజ్ రాకింగ్’ అంటున్నారు. ఎఫ్. గ్యారీ గ్రే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటి చార్లెస్ థెరాన్ కూడా ఎంటరయ్యారు. భారీ స్టార్  కాస్టింగ్.... హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతోన్న ఈ   చిత్రం చూడాలంటే  వచ్చే సమ్మర్ వరకూ ఆగాల్సిందే. 



బెంగాల్ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఆరు నెలలు కూడా కాకముందే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్ లో శుక్లా కు బెర్తు దొరికింది. 35 ఏళ్ల శుక్లా ఇక మీదట పశ్చిమబెంగాల్ మంత్రి.

పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమత వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మమతతో పాటు 42 మంది మంత్రులు ప్రమాణం చేశారు. 18 ఏళ్ల దేశవాళీ క్రికెట్ కెరీర్ కు గత డిసెంబర్ లో గుడ్ బై చెప్పిన శుక్లా ఎన్నికలకు ముందు తృణమాల్ కాంగ్రెస్ లో చేరారు. టీఎంసీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన శుక్లా తొలిప్రయత్నంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉత్తర హౌరా నియోజకవర్గం నుంచి పోటీచేసిన శుక్లా  దాదాపు 27 వేల ఓట్ల మెజార్టీతో లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి పాఠక్ ను ఓడించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో క్రీడా ప్రముఖులు టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ (కేరళ), భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (పశ్చిమబెంగాల్) ఓటమి చవిచూడగా, శుక్లా మాత్రం తొలిసారి ఎమ్మెల్యేగా  ఎన్నిక కావడంతో పాటు ఏకంగా మంత్రి అయ్యారు. శుక్లా టీమిండియా తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు ఆడారు.



బీజింగ్ : బాహుబలి సినిమా చూశారు కదూ.. అందులో శివుడి పాత్రధారి ప్రభాస్ నీళ్ల కొండ ఎక్కడానికి చాలా కష్టపడతాడు. ఎట్టకేలకు కొండ ఎక్కి.. హీరోయిన్‌ను కలుస్తాడు. చైనాలో కూడా అలాంటిదే ఓ పెద్ద కొండ ఉంది. కానీ ఆ కొండను ఎక్కేది మాత్రం చైనా బాహుబలి కాదు.. స్కూలు పిల్లలు! అవును, ప్రపంచానికి దూరంగా మారుమూల కొండ ప్రాంతంలో ఉండే ఓ కుగ్రామానికి చెందిన పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే 2,624 అడుగుల ఎత్తున్న కొండను ఎక్కాలి. మళ్లీ ఇళ్లకు రావాలంటే దిగాలి. కొండ ఎక్కేందుకు వారికి రెండు గంటల సమయం పడుతుంది. అలా ఎక్కడం కూడా చాలా కష్టమైన, ప్రమాదకరమైన పని.

                                                                                                                                     SakshiNewspapers




అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరక్కెకిన సరైనోడు చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు బోయపాటి, బన్నీ మొక్కును చెల్లించుకునేందుకు సింహాచలం వెళ్ళారు. వరాహ స్వామిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అక్కడ వీరిరివురికి ఓ చేదు అనుభవం ఎదురైంది. అప్పన్నను దర్శించుకున్న తర్వాత బన్నీ, బోయపాటి లిఫ్ట్ ఎక్కగా సాంకేతిక లోపంతో ఆ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వెంటనే ఆలయ సిబ్బంది లిఫ్ట్ డోర్‌లని పగులగొట్టి వారిని బయటకు తీయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్‌లో పరిమితికి మించి ఎక్కడంతోనే ఇలా జరిగిందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget